ఊటీ, కొడైకెనాల్. సిమ్లా, కులు, మనాలి, కాశ్మీర్, డార్జీలింగ్, నైనిటాల్, ముస్సొరి .... ఈ పేర్లు చెబితేనే మనసు ఆహ్లాదంతో పరవశించి పోతుంది.. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, వంపులు తిరిగి ప్రవహించే జలపాతాలు, ఎన్నెన్నో ప్రకృతి ప్రసాదించిన అందాలు కవి కాని వాడికికూడా కవిత్వం తన్నుకొస్తుంది.. జీవితంలో ఒక్కసారైనా వాటిలో కనీసం ఒక్క ప్రదేశానికైనా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిరావాలని అనుకోని వారు ఎవ్వరు ఉండరు. ఆ ప్రదేశాలకు ఏమాత్రం తీసిపోని అందాలతో పాటు, గ్రామీణ గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా, ప్రకృతి ఒడిలో విరిసిన అందాల హరివిల్లు 'అరకు' మన కన్నులముందు ఒక అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, అనే సామెతను నిజం చేస్తూ మనం వేసవి సెలవలకు, విహారయాత్రలకు ఎక్కడి కేక్కడికో వేల రూపాయలు తగలేసి తిరిగొస్తాం! ఒక్కసారి మన రాష్ట్రంలోనే ఉన్న అరకు అందాలను కళ్ళారా చూస్తే 'ఈ జీవితానికి ఈ అనుభూతులు చాలు' అని మనకు అనిపిస్తుంది. అరకు విశేషాలు, అందాలు ఒకసారి మీ ముందుకు తెస్తున్నాను.. విశాఖపట్నానికి 116 కి.మీ.ల దూరంలో, సమ